తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు - telangana employees transfers
21:22 October 05
తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు
ఏపీ నుంచి తెలంగాణ రావాలనుకునే ఉద్యోగుల రిలీవ్‌పై ఏపీ కసరత్తు చేస్తోంది. స్థానికత, భాగస్వామి దృష్ట్యా తెలంగాణకు పంపాలని ఉద్యోగులు ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు రావాలనుకునే వారి నుంచి ఆప్షన్ ఫార్మ్స్ తీసుకోవాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఉద్యోగుల రిలీవ్‌పై ఏపీ ప్రభుత్వం రెండ్రోజుల్లో మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇదీ చూడండి: