గుజరాత్ నుంచి వస్తోన్న మత్స్యకారులు ఏపీ రాష్ట్రానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు గుజరాత్ నుంచి బస్సుల్లో మొన్న బయలుదేరారు. మత్స్యకారులు ప్రయాణిస్తున్న బస్సులు కృష్ణా జిల్లా విజయవాడ చేరుకున్నాయి. జగ్గయ్యపేట చెక్ పోస్ట్ వద్ద ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, అధికారులు వీరికి స్వాగతం పలికారు. బస్సుల్లో వస్తున్న మత్స్య కారులకు జాగ్రత్తలు చెప్పి విడతల వారీగా స్వస్థలాలకు పంపారు. మత్స్యకారులకు అల్పాహారం, మంచినీటి వసతి కల్పించారు.
గుజరాత్ నుంచి ఏపీకి చేరుకున్న మత్స్యకారులు - విజయవాడకు చేరుకున్న మత్స్యకారులు వార్తలు
గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్న బస్సులు ముందుగా కృష్ణా జిల్లా గరికపాడు చేరుకున్నాయి. జగ్గయ్యపేట చెక్ పోస్ట్ వద్ద ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, అధికారులు వీరికి స్వాగతం పలికారు. గరికపాడు నుంచి బయలుదేరిన బస్సులు విజయవాడకు చేరుకున్నాయి.
లాక్‌డౌన్‌తో గుజరాత్‌లో చిక్కుకున్న 3800 జాలర్లను ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి తీసుకొస్తోంది. విజయవాడలో జాలర్లకు ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని అందించేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మత్స్యకారులు వారి స్వస్థలాలకు చేరే వరకు ఆహారాన్ని అందించనున్నారు. 12 బస్సుల్లో 887 మంది మత్స్యకారులు రాష్ట్రానికి చేరుకున్నారు. రాష్ట్రానికి చేరుకున్న వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 700 మంది, విజయనగరం జిల్లాకు చెందిన 98, విశాఖ జిల్లాకు చెందిన 77 మంది మత్స్యకారులు ఉన్నారు.
ఇవీ చూడండి: వలస కూలీలతో బయలుదేరిన రైలు