AP Employees JAC Leaders: ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ చెప్పారు. అధికారులతో తమకు ఎలాంటి న్యాయమూ జరగడం లేదన్న ఆయన.. ఇకపై సీఎంతోనే చర్చిస్తామని స్పష్టం చేశారు.
ఈనెల 9న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉందని, అదేరోజు జిల్లా స్థాయి నేతలతో విస్తృతస్థాయి సమావేశం జరుపుతామని చెప్పారు. సమావేశం అనంతరం పోరాట కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఈలోగా తమ సమస్యలను సీఎం జగన్ పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు. తాము ఫ్రెండ్లీ ప్రభుత్వంగానే భావిస్తున్నామని.. కానీ ప్రభుత్వం మాత్రం తమపై వివక్ష చూపిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
"అధికారులతో ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇకపై సీఎంతోనే చర్చిస్తామని అధికారులకు స్పష్టం చేశాం. ఈ నెల 9న జిల్లాస్థాయి నేతలతో విస్తృతస్థాయి భేటీ ఉంటుంది. సమావేశం అనంతరం పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం. ఈలోగా మా సమస్యలను సీఎం పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం" - బండి శ్రీనివాస్, ఏపీజేఏసీ ఛైర్మన్