తెలంగాణ

telangana

ETV Bharat / city

EAPCET RESULTS: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల - ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల తాజా వార్తలు

ఏపీ ఈఏపీసెట్​ ( EAPCET RESULTS 2021 ) ఫలితాలను.. ఆంధ్రప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ విడుదల చేశారు. రేపటి నుంచి ర్యాంక్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

EAPCET RESULTS 2021
EAPCET RESULTS 2021

By

Published : Sep 8, 2021, 12:51 PM IST

ఏపీలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఏపీ ఈఏపీసెట్’ (EAPCET RESULTS 2021) ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో.. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంజినీరింగ్‌ (Engineering results) ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,34,205 (80.62శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి ర్యాంక్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 14న వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

విద్యార్థి పేరు ర్యాంకు జిల్లా
నిఖిల్‌ మొదటి(1) ర్యాంకు అనంతపురం
వరదా మహంతనాయుడు రెండో (2) ర్యాంకు శ్రీకాకుళం
వెంకట ఫణీష్‌ నాలుగో (4) ర్యాంకు కడప
దివాకర్‌ సాయి నాలుగో (4) ర్యాంకు విజయనగరం
మౌర్యా రెడ్డి ఐదో (5) ర్యాంకు నెల్లూరు
శశాంక్‌రెడ్డి ఆరో (6) ర్యాంకు ప్రకాశం
ప్రణయ్‌ ఏడో (7) ర్యాంకు విజయనగరం
హర్ష వర్మ ఎనిమిదో (8) ర్యాంకు విజయవాడ
కార్తికేయ తొమ్మిదో (9) ర్యాంకు పశ్చిమగోదావరి
ఓరుగంటి నివాస్‌ పదో (10) ర్యాంకు చిత్తూరు

తొలుత ఇంజినీరింగ్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌), ఆ తర్వాత వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఎంపీసీ స్ట్రీమ్‌కు 1,76,603 మంది దరఖాస్తు చేయగా.. 1,66,460మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో అయిదుగురు కోవిడ్ బారినపడ్డారని.. వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

ఇదీచూడండి:TS HIGH COURT: 'ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదు'

ABOUT THE AUTHOR

...view details