తెలంగాణ

telangana

ETV Bharat / city

రొమేనియా, హంగరీకి రాష్ట్ర ప్రభుత్వ బృందాలు..

ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రొమేనియా, హంగరీలకు ఏపీ ప్రతినిధుల బృందాలను పంపేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ నుంచి ఏపీ విద్యార్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది.

telugu students in ukraine
telugu students in ukraine

By

Published : Mar 2, 2022, 4:34 PM IST

ఉక్రెయిన్​-రష్యా యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు రొమేనియా, హంగరీలకు ప్రతినిధులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతినిధుల బృందానికి సీఎం జగన్ అంగీకారం తెలిపారు. 680 మంది విద్యార్థుల వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగశాఖకు అందించింది.

భారత్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ నుంచి ఏపీ విద్యార్థుల వివరాలు సేకరిస్తోంది. ఐబీ స్టాంపింగ్ కార్యాలయం నుంచి వివరాల ఆధారంగా విద్యార్థుల వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు.

తెలుగు విద్యార్థులను తీసుకురావాలి: తెదేపా

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సాధ్యమైనంత త్వరగా ఇండియాకు రప్పించాలని కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది. కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శిని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కలిసి, తెలుగు విద్యార్థుల వివరాలను అందజేశారు. తెదేపా హెల్ప్‌ లైన్‌ ద్వారా సేకరించిన వివరాలు అందించారు. తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. తెలుగు విద్యార్థుల తరలింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని కనకమేడల విమర్శించారు.

ఇదీ చదవండి:'కేసీఆర్​ మూలాలు బిహార్​లో ఉన్నాయ్​.. అందుకే వారికే కీలక పోస్టింగులు'

ABOUT THE AUTHOR

...view details