స్పీకర్ పోచారం మనవరాలి వివాహం.. వేడుకలో పక్కపక్కనే కూర్చున్న కేసీఆర్, జగన్ - hyderabad latest news
13:34 November 21
పక్కపక్కనే కూర్చున్న కేసీఆర్, జగన్
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహ వేడుకకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ హాజరయ్యారు. శంషాబాద్లో జరిగిన వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చొన్న కేసీఆర్, జగన్ కాసేపు ముచ్చటించుకున్నారు.
గతంలో దిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం ఇదే తొలిసారి. జలవివాదాలు మరోసారి తెరపైకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అనంతరం ఇరువురు సీఎంలు ఒకే వేదిక పంచుకోవడం విశేషం. ఈ వేడుకలో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పలకరించుకున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి హాజరైన తెరాస లోక్సభ పక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు వధూవరులను ఆశీర్వదించారు.
ఇదీచూడండి:CM KCR Delhi Tour: నేడు హస్తినకు సీఎం కేసీఆర్.. అన్ని విషయాలు తేల్చుకునేందుకే..