ఏపీలో.. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య కల్యాణోత్సవం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. కల్యాణోత్సవంతో.. అంతర్వేదిలో ఆధ్యాత్మికత విరాజిల్లింది. పంచగరుడ ఆంజనేయ స్వామి వాహనం, కచుగరుడ వాహనంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్ల విగ్రహాలను మాఢవీధుల్లో ఊరేగించారు. ఎదురుకోళ్ల వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపారు.
అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత స్వామివార్ల ఉత్సవ మూర్తుల్ని కల్యాణ మండప వేదికపై ప్రతిష్టింపజేశారు. కళ్యాణ మహోత్సవంలోని ప్రతి ఘట్టం విశిష్టతను అర్చకులు వివరిస్తూ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్ర యుక్త తులా లగ్న పుష్కరాంశ ముహూర్తంలో 11 గంటల 19 నిమిషాలకు దేవతా మూర్తులకు జీలకర్ర బెల్లం పెట్టారు.