నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు వసూలు చేస్తే... పదిరెట్లు జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి తప్పుచేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని....వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్ స్పష్టం చేశారు.
వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని....కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.