తెలంగాణ

telangana

ETV Bharat / city

AP 10th Results: పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు - telangana news

కొవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావడం వల్ల ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2020-2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి ఫార్ములాను రూపొందించింది. 2021 విద్యా సంవత్సరంలోని విద్యార్థులందరికీ అంతర్గత అసెస్​మెంట్ మార్కులను 30 వెయిటేజీగా మరో 70 శాతం వెయిటేజిని స్లిప్ టెస్టులకు పరిగణించాలని సిఫార్సు చేసింది.

AP 10th Results, ap government green signal to high power committee suggestions
ఏపీ పదో తరగతి ఫలితాలు, ఏపీ హైపవర్ కమిటీకి ప్రభుత్వం ఆమోదం

By

Published : Aug 2, 2021, 7:39 PM IST

పదో తరగతి పరీక్షల ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. 2020-2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి హైపవర్ కమిటీ ఫార్ములాను రూపొందించింది. 2019-2020 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించేందుకు నిర్ణయించింది. ఆ ఏడాదిలో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మెటివ్ అసెస్​మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించాలని స్పష్టం చేసింది. 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిల్ అయ్యి 2020లో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గతంలోని వారి సామర్థ్యం ఆధారంగా 20 మార్కులకు లెక్కించి వంద మార్కులకు దాన్ని పరిగణించాలని సూచించింది.

2021 విద్యా సంవత్సరంలోని విద్యార్థులందరికీ అంతర్గత అసెస్​మెంట్ మార్కులను 30 వెయిటేజీగా మరో 70 శాతం వెయిటేజిని స్లిప్ టెస్టులకు పరిగణించాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది. వివిధ కారణాల రీత్యా అంతర్గత అసెస్​మెంట్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు పాస్ గ్రేడ్ ఇవ్వాలని సిఫార్సుల్లో పేర్కొంది. వొకేషనల్ విద్యార్థులకు ఎస్ఎస్సీ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:Gachibowli Accident: సరదాగా సాగిన వాళ్ల ఫ్రెండ్​షిప్​డే.. తీరని విషాదంతో ముగిసింది

ABOUT THE AUTHOR

...view details