Anandaiah Political Party: కొవిడ్ రెండో దశలో.. కరోనా నివారణ మందు పేరిట పంపిణీ చేసి గుర్తింపు పొందిన ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. యాదవ సంఘం జాతీయ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ పెట్టనున్నట్లు తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని ఆయన సోమవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందయ్య విలేకరులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని అన్నారు.
Anandiah Herbal Medicine : కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు తన వద్ద మందు ఉందని, ఏపీ ప్రభుత్వం సహకరిస్తే అందిస్తానని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణ మందు తయారీకి ఏపీ ప్రభుత్వం సహకరించలేదని ఆనందయ్య ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం అఖిల భారతీయ యాదవ మహాసభ 13 జిల్లాల సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆనందయ్య మాట్లాడుతూ ఆయుర్వేద మందు పంపిణీ విషయంలో విద్యుత్తు సరఫరాకు అనుమతులు ఇవ్వమని కోరినా ఎన్‌వోసీ రాలేదన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 13 జిల్లాల్లో రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.