తెలంగాణ

telangana

Amaravati padayatra schedule: 15వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర

By

Published : Nov 15, 2021, 11:55 AM IST

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 15వ రోజు(Amaravati padayatra schedule) కొనసాగుతోంది. ఏపీలోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎం. నిడమానురు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇవాళ 14. కి.మీ సాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా రైతులు ఈ పోరాటం చేస్తున్నారు.

Amaravati padayatra schedule, Amaravathi Farmers Maha Padayatra
అమరావతి పాదయాత్ర 15వ రోజు ప్రారంభం, అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి రైతులు చేపట్టిన "న్యాయస్థానం నుంచి దేవస్థానం" మహాపాదయాత్ర (Amaravathi Farmers Maha Padayatra) 15వ రోజు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో 9వ రోజుకు చేరింది. జరుగుమల్లి మండలం ఎం.నిడమానురు నుంచి ప్రారంభమైన పాదయాత్ర(Amaravati padayatra schedule).. సోమవారం సుమారు 14 కి.మీ సాగనుంది. కందుకూరు మండలం విక్కిరాలపేటలో ఇవాళ రాత్రి బస చేయనున్నారు.

అమరావతి పాదయాత్ర 15వ రోజు ప్రారంభం, అమరావతి రైతుల పాదయాత్ర

ఉత్సాహంతో అడుగులు

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. 45 రోజులపాటు మహా పాదయాత్ర చేపట్టారు. డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునేలా పాదయాత్ర చేపట్టారు. 14వ రోజు టంగుటూరు మండలం యరజర్ల శివారు నుంచి ప్రారంభమైన యాత్ర ఎం.నిడమనూరు వరకు 13 కిలోమీటర్ల మేర సాగింది. ఎక్కడికక్కడ మేళ తాళాలు, నృత్యాలతో రైతులకు పూలబాట పరచి గ్రామాల్లోకి ఆహ్వానించారు. జనం స్పందన తమ అలసటను దూరం చేస్తోందన్న రైతులు.. ఇకపైనా రెట్టించిన ఉత్సాహంతో అడుగులేస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన ఏపీ మంత్రులు విచక్షణ మరిచి రైతులపై అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇలా ప్రారంభం..
అమరావతి పాదయాత్ర 15వ రోజు ప్రారంభం, అమరావతి రైతుల పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి పరిరక్షణ పోరాటంలో మరో కీలక మలుపు ఆవిష్కృతం కానుంది. రైతులు, మహిళలు ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వెంకటేశ్వర స్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు, సర్వమత ప్రార్థనల అనంతరం రాజధాని ఉద్యమ జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. తుళ్లూరులో ఉదయం 9 గంటల 5 ఐదు నిమిషాలకు పాదయాత్ర(Amaravati padayatra schedule) ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు 45 రోజులపాటు పాదయాత్ర జరగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా అమరావతి రైతులు తమ పోరు ఉద్ధృతం చేస్తున్నారు. 684 రోజులుగా ఉద్యమాన్ని వివిధ రూపాల్లో హోరెత్తిస్తున్న రైతులు, మహిళలు.. ప్రజా పాదయాత్ర పేరుతో ముందడుగు వేస్తున్నారు. ప్రజా పాదయాత్రకు తొలుత సమ్మతి నిరాకరించినప్పటికీ.. ఏపీ హైకోర్టు ఆదేశాలతో షరతులతో కూడిన అనుమతి పోలీసులు మంజూరు చేశారు. కనీసం రోజుకు 12 నుంచి 14 కిలోమీటర్లు నడిచేలా ప్రణాళిక(amaravati padayatra route map) రూపొందించారు. ఆదివారం యాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఎప్పటికప్పుడు పాతవారి స్థానంలో కొత్తవారిని చేర్చుకునేలా రూపకల్పన చేస్తున్నారు. పాదయాత్రలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 9 కమిటీలను నియమించి పాదయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. అమరావతి నిరసన ఉద్యమం మాదిరిగానే పాదయాత్ర పూర్తిగా శాంతి, అహింస మార్గంలో నడుస్తుందని.. ఐకాస నేతలు తెలిపారు.

పాదయాత్ర స్పెషల్ సాంగ్
అమరావతి పాదయాత్ర 15వ రోజు ప్రారంభం, అమరావతి రైతుల పాదయాత్ర

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై(maha padayatra special song) నిర్వాహకులు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. నవంబర్‌ 7న తుళ్లూరు నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఏడు రోజుల పాటు నిర్విరామంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసి డిసెంబర్‌ 17కి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుమలలో అదే రోజు పాదయాత్ర ముగించనున్నారు. పాదయాత్ర విశేషాలతో కూడిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details