- నోవాటెల్ హోటల్ చేరుకున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా
- కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కలవనున్న అమిత్ షా
- అమిత్‌షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీని ధ్రువీకరించిన భాజపా వర్గాలు
- జూనియర్ ఎన్టీఆర్‌ను సమావేశానికి ఆహ్వానించిన అమిత్‌షా
కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కలవనున్న అమిత్ షా
20:01 August 21
కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కలవనున్న అమిత్ షా
18:52 August 21
కేసీఆర్ కుటుంబ పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధ పడాలి: అమిత్ షా
- కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు పదవుల్లో ఉంటే మాకు బాధ లేదు
- కేసీఆర్ కుటుంబ పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధ పడాలి: అమిత్ షా
- కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది
- అన్ని రాష్ట్రాలు రెండుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే కేసీఆర్ తగ్గించలేదు
- కేసీఆర్ వైఖరి వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధర తెలంగాణలోనే అధికంగా ఉంది
- మునుగోడు అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉంటుంది
- తెలంగాణలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా?:
- అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరిన పలువురు నాయకులు
- పలువురు నేతలకు భాజపా కండువా కప్పిన అమిత్ షా
18:45 August 21
మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదు
- రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్లు కాదు
- కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి సముద్రంలో పారేసేందుకు ఇది ప్రారంభం
- రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయం అవుతుంది
- మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదు
- తెలంగాణలో భాజపా ప్రభుత్వం వచ్చితీరుతుంది: అమిత్ షా
- భాజపా ప్రభుత్వం వచ్చాక సెప్టెంబరు 17ను ఉత్సవంగా జరుపుతాం
- నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తానని కేసీఆర్ ఇచ్చారా?
- ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారా?
- రెండు పడకల గది ఇళ్లు కాదు కదా.. టాయిలెట్లు కూడా నిర్మించలేదు
- కేంద్రం నిర్మించే మరుగుదొడ్లను కేసీఆర్‌ను అడ్డుకుంటున్నారు
- దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా?
- తెరాసకు ఓటు వేస్తే.. ఎన్నిసార్లయినా కేసీఆర్ సీఎం అవుతారు తప్ప దళితుడు కాదు
- హుజురాబాద్‌లో చెప్పిన దళితబంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు
- దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చారా?: అమిత్ షా
- రైతులను కేసీఆర్ తీవ్రంగా మోసం చేస్తున్నారు: అమిత్ షా
- పీఎం ఫసల్ బీమాను తెలంగాణలో అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు
- భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ధాన్యం గింజను కొంటుంది
18:34 August 21
ఈడీ, సీబీఐ పేరు చెప్తే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు: కిషన్‌రెడ్డి
- కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: కిషన్‌రెడ్డి
- తెలంగాణ తల్లికి విముక్తి కల్గించేందుకు అమిత్ షా వచ్చారు: కిషన్‌రెడ్డి
- ఈడీ, సీబీఐ పేరు చెప్తే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు: కిషన్‌రెడ్డి
- తప్పు చేసిన వారే దర్యాప్తు సంస్థలంటే భయపడతారు: కిషన్‌రెడ్డి
- కేసీఆర్ ప్రతిపశ్నకు జవాబు చెప్పే సత్తా భాజపాకు ఉంది: కిషన్‌రెడ్డి
- రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి భాజపాలో చేరారు: కిషన్‌రెడ్డి
18:21 August 21
మునుగోడు అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా కేసీఆర్‌కు లేదు: రాజగోపాల్‌రెడ్
- కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించాలి: రాజగోపాల్‌రెడ్డి
- ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి నేను వెళ్లట్లేదు: రాజగోపాల్‌రెడ్డి
- రాజీనామా చేసి నిజాయతీగా ప్రజల తీర్పు కోరుతున్నా: రాజగోపాల్ రెడ్డి
- కేసీఆర్ వివక్షకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నా: రాజగోపాల్‌రెడ్డి
- ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా కేసీఆర్ ఇవ్వలేదు: రాజగోపాల్‌రెడ్డి
- నా రాజీనామా తర్వాతే కేసీఆర్ నిద్ర లేచారు: రాజగోపాల్ రెడ్డి
- నా రాజీనామాతో గట్టుప్పల్ మండలం, పింఛన్లు వచ్చాయి: రాజగోపాల్
- 2018లో చెప్పిన 57 ఏళ్ల వారికి ఫించను ఇప్పుడు ఇస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి
- దేశ, రాష్ట్ర అభివృద్ధి భాజపాతోనే సాధ్యం: రాజగోపాల్‌రెడ్డి
- మునుగోడు అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా కేసీఆర్‌కు లేదు: రాజగోపాల్‌రెడ్డి
- కాళేశ్వరం అక్రమసొమ్ముతో ఎమ్మెల్యేలను కొన్నారు: రాజగోపాల్‌రెడ్డి
18:19 August 21
కేసీఆర్ కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి: లక్ష్మణ్
- నిన్న తెరాస సభ జనం లేక వెలవెలబోయింది: ఎంపీ లక్ష్మణ్
- కేసీఆర్ వైఖరి.. ఆడలేక మద్దెలఓడు అన్నట్లుంది: ఎంపీ లక్ష్మణ్
- రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారు: లక్ష్మణ్
- రాష్ట్రంలో ధాన్యం కొనకుండా కేసీఆర్ రైతులను ఇబ్బంది పెట్టారు: లక్ష్మణ్
- కేసీఆర్ కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి: లక్ష్మణ్
- నయా నిజాం మెడలు వంచేది భాజపా మాత్రమే: ఎంపీ లక్ష్మణ్
18:08 August 21
- నిన్న తెరాస సభ జనం లేక వెలవెలబోయింది: ఎంపీ లక్ష్మణ్
- కేసీఆర్ వైఖరి.. ఆడలేక మద్దెలఓడు అన్నట్లుంది: ఎంపీ లక్ష్మణ్
- రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారు: లక్ష్మణ్
- రాష్ట్రంలో ధాన్యం కొనకుండా కేసీఆర్ రైతులను ఇబ్బంది పెట్టారు: లక్ష్మణ్
- కేసీఆర్ కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి: లక్ష్మణ్
- నయా నిజాం మెడలు వంచేది భాజపా మాత్రమే: ఎంపీ లక్ష్మణ్
18:06 August 21
- మునుగోడులో భాజపా బహిరంగ సభకు హాజరైన అమిత్ షా
- రాజగోపాల్‌రెడ్డిని భాజపాలోకి ఆహ్వానించిన అమిత్ షా
- రాజగోపాల్‌రెడ్డికి కాషాయ కండువా కప్పిన అమిత్ షా
17:21 August 21
మునుగోడు సభా వేదిక వద్దకు చేరుకున్న అమిత్ షా
- మునుగోడు సభా వేదిక వద్దకు చేరుకున్న అమిత్ షా
- అమిత్ షా రాకతో నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం
- మునుగోడు బహిరంగసభకు బయలుదేరిన అమిత్ షా
- బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన అమిత్ షా
16:49 August 21
కేసీఆర్ దిల్లీలో మద్దతు ఇచ్చి రాష్ట్రానికి వచ్చి మాట మార్చారు: సంజయ్
- విద్యుత్ సవరణ చట్టాల మీద ఎలాంటి చర్చ జరగలేదు: బండి సంజయ్
- కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్
- సేంద్రీయ వ్యవసాయం గురించే అమిత్ షా మాట్లాడారు: బండి సంజయ్
- దిల్లీలో విద్యుత్ చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారు: బండి సంజయ్
- కేసీఆర్ దిల్లీలో మద్దతు ఇచ్చి రాష్ట్రానికి వచ్చి మాట మార్చారు: సంజయ్
16:37 August 21
మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు
- ధనిక రాష్ట్రంలో పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేని దుస్థితి: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
- కమీషన్లు వచ్చే కాళేశ్వరంలోనే నిధులన్నీ గుమ్మరించారు: కొండా విశ్వేశ్వరరెడ్డి
- ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేసీఆర్ నిధులు ఇవ్వలేదు
- మునుగోడులో ఉపఎన్నిక రాబోతుందని ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు
- మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు
- మీటర్లు ట్రాన్స్‌ఫార్మర్లకు పెడతారు కానీ.. రైతుల మోటార్లకు కాదు
16:35 August 21
విద్యుత్ మోటర్లకు మీటర్ల గురించి అమిత్ షాను అడిగాం: రైతు నేతలు
- విద్యుత్ మోటర్లకు మీటర్ల గురించి అమిత్ షాను అడిగాం: రైతు నేతలు
- విద్యుత్ చట్టాలను మార్చాలని అమిత్ షాను అడిగాం: రైతు సంఘాల నేతలు
- చట్టాలు కాదు.. ముందు ప్రభుత్వాన్ని మార్చాలన్నారు: రైతు సంఘాల నేతలు
16:17 August 21
కాసేపట్లో మునుగోడు సమరభేరి సభకు హాజరుకానున్న అమిత్ షా
- మునుగోడులో కాసేపట్లో భాజపా బహిరంగ సభ
- మునుగోడు సమరభేరి సభకు హాజరుకానున్న అమిత్ షా
- ఇప్పటికే సభా స్థలికి చేరకున్న పలువురు భాజపా నాయకులు
- మునుగోడులో భాజపా సభకు తరలివస్తున్న కార్యకర్తలు, ప్రజలు
- సభకు హాజరైన లక్ష్మణ్, రాజాసింగ్, రఘునందన్‌రావు, మురళీధర్‌రావు
- సభకు హాజరైన డి.కె.అరుణ, వివేక్, ఇంద్రసేనారెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి
15:50 August 21
రైతు సంఘాల నేతలతో ముగిసిన అమిత్ షా సమావేశం
- రైతు సంఘాల నేతలతో ముగిసిన అమిత్ షా సమావేశం
15:37 August 21
రాత్రి 8.30 గంటలకు అమిత్ షాతో భేటీకానున్న ఎన్‌టీఆర్
- రాత్రి 8.30 గం.కు అమిత్ షాతో భేటీకానున్న ఎన్‌టీఆర్
- నోవాటెల్ హోటల్‌లో అమిత్ షాను కలవనున్న ఎన్‌టీఆర్
15:18 August 21
బేగంపేటలో రైతుసంఘాల నేతలతో సమావేశమైన అమిత్ షా
- బేగంపేటలో రైతుసంఘాల నేతలతో సమావేశమైన అమిత్ షా
- కాసేపట్లో మునుగోడు సభకు బయలుదేరనున్న అమిత్ షా
15:05 August 21
కార్యకర్త సత్యనారాయణ ఇంట్లో తేనీరు సేవించిన అమిత్ షా
- సికింద్రాబాద్‌లో భాజపా కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్‌షా
- సాంబమూర్తినగర్‌లో ఎస్సీ కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్‌షా
- కార్యకర్త సత్యనారాయణ ఇంట్లో తేనీరు సేవించిన అమిత్ షా
- అనంతరం బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరిన అమిత్ షా
14:37 August 21
సాంబమూర్తినగర్‌లోని భాజపా కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్ షా
- భాజపా కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్ షా
- సాంబమూర్తినగర్‌లోని భాజపా కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్ షా
- కార్యకర్త సత్యనారాయణ ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు
- అమిత్‌షా రాకతో భారీగా మోహరించిన పోలీసులు
- అమిత్‌షాకు స్వాగతం పలికిన సత్యనారాయణ కుటుంబసభ్యులు
14:24 August 21
అమిత్‌షాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద అమిత్ షా
- అమిత్‌షాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భారీ బందోబస్తు
- ఎవరినీ లోపలికి అనుమతించకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు
- అమిత్‌షా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు
14:13 August 21
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భారీ బందోబస్తు
- ఎవరినీ లోపలికి అనమతించకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు
14:13 August 21
- ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం భాజపా కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లనున్న అమిత్ షా
- అనంతరం బేగంపేటలోని మనోహర్ హోటల్‌కి వెళ్లనున్న అమిత్ షా
- మ.3.20 నుంచి సా. 4 వరకు రైతు సంఘాల నేతలతో సమావేశం
- సాయంత్రం 4.10గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు అమిత్ షా
- సాయంత్రం 4.40 గంటలకు సీఆర్పీఎఫ్ అధికారులతో అమిత్‌షా సమావేశం
- సా.5 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్రమంత్రి అమిత్ షా
- సభలో అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరనున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి
- రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ నోవాటల్ హోటల్ చేరుకోనున్న అమిత్ షా
- రాత్రి 8 గంటల నుంచి 9 వరకు భాజపా ముఖ్య నేతలతో సమావేశం
- ముఖ్యనేతలతో సమావేశం అనంతరం దిల్లీ వెళ్లనున్న కేంద్రమంత్రి అమిత్ షా
14:07 August 21
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి బయలుదేరిన అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి
- ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న నేతలు
- దాదాపు అరగంట పాటు అమ్మవారి ఆలయంలో గడపనున్న అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి
13:57 August 21
బేగంపేట విమానాశ్రయంలో అమిత్ షాకు ఘన స్వాగతం
- బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా
- అమిత్‌షాకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- స్వాగతం పలికిన బండి సంజయ్, తరుణ్ చుగ్, ప్రేమేందర్ రెడ్డి
- అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకోనున్న అమిత్ షా