తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాశ్ ఆకస్మిక మృతి జర్నలిస్టులకు తీరని లోటని రాష్ట్ర మీడియా ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. గత కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్న ప్రకాశ్... కరోనాతో మృతి చెందడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకు తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి... దానికి అధ్యక్షుడిగా విలువైన సేవలందించారన్నారు.
'జర్నలిస్ట్ ప్రకాశ్ కుటుంబానికి అండగా ఉంటాం' - corona deathes
కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్ట్ ప్రకాశ్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర మీడియా ఛైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకు తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి... దానికి అధ్యక్షుడిగా విలువైన సేవలందించారని గుర్తు చేసుకున్నారు.
allam narayana convey condolences to journalist prakash family
రాష్ట్ర ప్రప్రథమ అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా సేవలుఅందించారని... జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. ఓ న్యూస్ ఛానల్ ఆరంభం నుంచి పనిచేసిన ప్రకాశ్ మృతి బాధకరమనన్నారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని అల్లం నారాయణ తెలిపారు.
ఇదీ చూడండి:ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్ గణపయ్య
Last Updated : Aug 22, 2020, 5:17 PM IST