ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 25న ఛలో సెక్రెటరేట్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. సచివాలయం కూల్చడం, కొత్త శాసనసభ నిర్మించడం వల్ల ప్రజాధనం వృథా అవుతుందని అఖిలపక్షం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఉన్న నిధులను సంక్షేమ పథకాలకు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. జి.వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు మీడియా సమావేశంలో నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీలకతీతంగా ఛలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నామని అన్ని పార్టీల నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు.
25న ఛలో సచివాలయం: అఖిలపక్షం
నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఈనెల 25న సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
akilapaksham