తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... రైతులపై తీసుకుంటున్న వ్యతిరేక విధివిధానాలపై ఆన్లైన్ ద్వారా బహిరంగ సభ నిర్వహించారు. లాక్డౌన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, వ్యవసాయ కార్మికులకు సాయం చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం... రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలు, రుణమాఫీ వంటి చర్యలు చేపట్టకుండా వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం చూస్తోందని వారు ఆరోపించారు.
'వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తారా?' - వ్యవసాయరంగం వార్తలు
వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం చూస్తోందని తెలంగాణ రైతు సంఘం ఆరోపించింది. భాజపా సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రైతులను అశక్తులుగా మార్చేవిధంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
aiks meeting on farming
రైతులందరికీ ఉచితంగా కరోనా టెస్టులు ఉచితంగా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు విన్నవించారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై అధికారుల వేధింపులు ఆపాలని, అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు.
ఇదీ చూడండి:భద్రాచలం గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ