తెలంగాణ

telangana

ETV Bharat / city

AICTE Internship for Students : ఒక్క క్లిక్​తో ఇంటర్న్​షిప్.. విద్యార్థుల కోసం ప్రత్యేక పోర్టల్

AICTE Internship for Students : ఇంజినీరింగ్, మేనేజ్​మెంట్ తదితర వృత్తి విద్యలు అభ్యసించే విద్యార్థులు ఇంటర్న్​షిప్​ కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ అవస్థలు పడలేక ఆసక్తి ఉన్నా కొంతమంది దూరం ఉండేవారు. అందుకోసమే అఖిల భారత్ సాంకేతిక విద్యామండలి ఓ యోచన చేసింది. విద్యార్థులకు ఇంటర్న్​షిప్ అవకాశం కల్పించేలా ప్రత్యేక పోర్టల్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

AICTE Internship for Students
AICTE Internship for Students

By

Published : Dec 23, 2021, 8:16 AM IST

AICTE Internship for Students : రిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు వాటి చుట్టూ తిరగడం.. అధికారులను బతిమలాడుకోవడం.. సిఫారసు లేఖలు సమర్పించడం.. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ తదితర వృత్తి విద్యలు అభ్యసించే విద్యార్థులు ఇప్పటివరకు ఇలా ఎన్నో అవస్థలు పడేవారు. ఆసక్తి ఉన్నా చాలామంది దూరంగా ఉండేవారు.

ప్రత్యేక పోర్టల్..

AICTE Internship Registration : అయితే ఇంటర్న్‌షిప్‌ చేయకుండా విద్యార్థులు తగిన నైపుణ్యాలను సాధించలేరని భావించిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఇందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీటెక్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ ఏఐసీటీఈ మూడేళ్ల క్రితం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. రెండో సెమిస్టర్‌ నుంచే ఆ ప్రక్రియను మొదలుపెట్టొచ్చు. ఈ క్రమంలోనే ఏఐసీటీఈ ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించి.. గత ఏడాది అందుబాటులోకి తెచ్చింది. పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

కోటి మందికి అవకాశం..

AICTE Internship Portal Login : 2025 నాటికి కోటి మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించాలన్నది కేంద్ర విద్యాశాఖ, ఏఐసీటీఈల లక్ష్యం. 2020లో 5 లక్షల మందికి కల్పించారు. ఈ ఏడాది ఆగస్టు 25న ఒక్క రోజే 6.10 లక్షల అవకాశాలను అందుబాటులోకి తెచ్చారు.

దరఖాస్తు ఇలా..

Internships for Students : ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌పై క్లిక్‌ చేయాలి. అందులో స్టూడెంట్‌ రిజిస్ట్రేషన్‌ వద్ద క్లిక్‌ చేసి.. తాము చదివే వర్సిటీ, కళాశాల, విద్యార్థి గుర్తింపు సంఖ్య తదితర వివరాలను పొందుపరచాలి. తర్వాత రంగం(సెక్టార్‌), నగరాన్ని ఎంచుకోవాలి. రాష్ట్రాలు, వాటిలోని నగరాల పేర్లను క్లిక్‌ చేస్తే.. ఏ రంగంలో ఎన్ని ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి? దరఖాస్తుకు తుది గడువు వివరాలు ఉంటాయి. ఇంటర్న్‌షిప్‌ గడువు రెండు నుంచి ఎనిమిది వారాల వరకు ఉంటుంది. కొన్ని సంస్థలు స్టైపెండ్‌ సైతం అందిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details