భూ క్రమబద్దీకరణపై ప్రభుత్వం పునరాలోచించాలి: వంశీచంద్ రెడ్డి
నూతన భూ క్రమబద్దీకరణపై ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వ పునరాలోచించుకోవాలని కోరారు. ప్రతిపక్షాలతో చర్చించి... అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
భూ క్రమబద్దీకరణపై ప్రభుత్వం పునరాలోచించాలి: వంశీచంద్ రెడ్డి
నూతన భూక్రమబద్దీకరణ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని... ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి కోరారు. ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్-131అశాస్త్రీయమని పేర్కొన్నారు. కరోనా వేళ కాలానికి ఎదురీదుతున్న ప్రజలకు... ఉపశమన చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం... ఖజనా నింపుకునేందుకు ప్రాధాన్యమివ్వటం సరైంది కాదన్నారు. ప్రజల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చకముందే... అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
TAGGED:
land regularization