ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయానికి పునర్వైభవం రాబోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సేంద్రియ రైతు చింతల వెంకట్‌రెడ్డి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు.
'ఈ పురస్కారం తెలంగాణ అన్నదాతలందరిది' - పద్మశ్రీ గ్రహీత చింతల వెంకట్‌రెడ్డి
రాబోయే రోజుల్లో వ్యవసాయానికి పూర్వవైభవం రాబోతోందని, రైతులెవరూ భూములు అమ్ముకోవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సేంద్రియ రైతు చింతల వెంకట్‌రెడ్డి ఆత్మీయ అభినందన సభకు హాజరయ్యారు.
ఈ సభకు ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ప్రకృతి రైతు... చింతల వెంకట్‌రెడ్డిని మంత్రులు ఘనంగా సత్కరించారు. మట్టి మనిషి వెంకట్‌రెడ్డిపై రూపొందించిన ప్రత్యేక సంచిని ఆవిష్కరించారు.
కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు వస్తాయని, అన్ని రకాల పంటల సాగు, అధిక దిగుబడులు, పలు రాష్ట్రాలు-దేశాలకు ఎగుమతులకు అవకాశం ఉన్నందున రైతులెవరూ భూములు అమ్ముకోవద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. విస్తృత పరిశోధనలు చేస్తూ ప్రకృతి సేద్యం చేస్తున్న రైతు చింతల వెంకటరెడ్డికి పద్మశ్రీ పురస్కారం రావడం తెలంగాణ రాష్ట్ర రైతులందరికి వచ్చినట్లేనని అన్నారు.