లాభాల బాటలో గిడ్డంగుల సంస్థ : ఛైర్మన్ సామేల్ - నిరంజన్‌రెడ్డి
గిడ్డంగుల సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు ఆ సంస్థ ఛైర్మన్ మందుల సామేల్. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి అందించారు.
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ లాభాల బాటలో పయనిస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ మందుల సామేల్ తెలిపారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల వాటా రూ.6.5 కోట్లను ప్రభుత్వానికి అందించారు. ఈమేరకు చెక్కులను గిడ్డంగుల సంస్థ ఎండీతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రికి అందించారు. రాష్ట్రంలో గిడ్డంగుల సంస్థ లాభాల్లో కేంద్ర, రాష్ట్రాలకు వాటా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటల నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో గిడ్డంగుల సంస్థను మరింత లాభాల్లోకి తీసుకెళ్తామని సామేల్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్ కిట్... అమ్మకు అందని ఆసరా