ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో ఓమ్ని మెడీ సంస్థ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఓమ్ని సంస్థ ప్రతినిధి నాగరాజు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో ఈఎస్‌ఐకు చెందిన రూ.46 కోట్ల రూపాయల విలువైన ఇండెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దఎత్తున అతని నివాసంలో ఇండెంట్లు చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. కార్మిక బీమా వైద్యసేవల సంస్థ సంచాలకుల కార్యాలయంలో ఉండాల్సిన ఇండెంట్లు నాగరాజు నివాసంలో ఎందుకు ఉన్నాయనే దానిపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో మరింతమంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులను అనిశా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఈఎస్ఐ కేసులో బయటపడుతున్న "ఓమ్ని" లీలలు
ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో ఓమ్ని మెడీ సంస్థ ప్రతినిధి నాగరాజు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.46 కోట్ల విలువ గల ఇండెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొంత మందిని అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఈఎస్ఐ కేసులో బయటపడుతున్న ఓమ్ని సంస్థ లీలలు