మేడ్చల్ జిల్లా జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విద్యుత్ స్తంభాల మార్పు, కొత్త మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి దగ్గర ఆర్టీజెన్ తుకారాం లంచం డిమాండ్ చేయడంతో.. కాంట్రాక్టర్ శివ ఏసీబీని ఆశ్రయించాడు.
ఏసీబీ వలలో జీడిమెట్ల విద్యుత్ కార్యాలయ ఉద్యోగి - జీడిమెట్ల విద్యుత్ కార్యాలయం తాజా వార్తలు
ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో అధికారులు దాడులు నిర్వహించారు. రూ.8,000 లంచం తీసుకుంటుండగా ఆర్టీజెన్గా పనిచేస్తున్న తుకారాంను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
రూ.8,000 లంచం తీసుకుంటుండగా జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో తుకారాంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. తుకారాంను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: 'బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'