తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎస్‌ సమీర్​ శర్మను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు

AB Venkateswara Rao meets CS Sameer Sharma: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. ఏపీ సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిశారు. తన పోస్టింగ్​కు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎస్​కి అందచేశారు. పోస్టింగ్ అంశాన్ని ప్రాసెసింగ్​లో పెడతామని సీఎస్ హామీ ఇచ్చినట్టు వెంకటేశ్వరరావు వెల్లడించారు.

AB Venkateswara Rao
ఏబీ వెంకటేశ్వరరావు

By

Published : Apr 30, 2022, 5:09 AM IST

AB Venkateswara Rao meets CS Sameer Sharma: తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయానికి వెళ్లారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎస్ సమీర్ శర్మను కలిసి సుప్రీంకోర్టు ఆదేశాలను అందచేశారు. పోలీసు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫాం ధరించి సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల రీత్యా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు సచివాలయానికి వచ్చినట్లు ఏబీవీ స్పష్టం చేశారు. పోస్టింగ్‌తో పాటు పెండింగ్ జీత భత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పోస్టింగ్ అంశాన్ని ప్రాసెస్‌లో పెడతామని సీఎస్ హామీ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు.

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలసిందే. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ కొనసాగించడం కుదరదని పేర్కొంది. ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు ఏబీవీ సచివాలయానికి వచ్చారు.

అసలేం జరిగిందంటే...

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారని దాఖలైన అభియోగాలపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని.. ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.

ఇదీ చదవండి:పర్యావరణహితంగా మాస్టర్‌ ప్లాన్​లను రూపొందిస్తాం: మంత్రి కేటీఆర్‌

'త్వరలో హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.. అదే ప్రధాన లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details