Theft Live Video: ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డలో.. ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా.. ఓ ఇంట్లోకి వచ్చిన దొంగకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. దొంగలించేందుకు ఏమీ దొరక్క అక్కడున్న టీషర్ట్‌ను తీసుకెళ్లిపోయాడు. అనంతరం ఆ ఇంటి నుంచి బయటకు వస్తూ కనిపించిన బైక్‌ను తీసుకెళ్లిపోయాడు. ఈ వీడియో అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతరం బైక్‌ను నాగాయలంకలో వదిలేశాడు. అక్కడ మరో ద్విచక్రవాహనాన్ని కాజేశాడని పోలీసులు తెలిపారు.
Theft Live Video: ఏమీ దొరక్క.. టీషర్ట్ ఎత్తుకెళ్లిన దొంగ! - టిషర్ట్ దొంగ
Theft Live Video: చోరీ చేసేందుకు ఓ ఇంట్లోకి వెళ్లిన దొంగకు ఏమీ దొరక్క అక్కడున్న టీషర్ట్ ఎత్తుకెళ్లాడు. అనంతరం బయటకొచ్చాక ఇంటి ఆవరణలో ఉన్న బైక్‌ను తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన వీడియోలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది.
ఇటీవల దివిసీమ ప్రాంతంలోని యువత మత్తుకు అలవాటుపడి.. డబ్బుకోసం చోరీలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అవనిగడ్డలో బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వ్యసనాలకు బానిసై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు భావిస్తున్నారు. యువత మత్తుకు బానిసలవ్వకుండా.. గట్టి నిఘాపెట్టినట్లు అవనిగడ్డ సబ్ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీచూడండి:woman missing in SR Nagar : భార్య అదృశ్యం.. భర్తల గాలింపు!