Murder Attempt: విద్యుత్తు తీగలు చుట్టి భార్యా బిడ్డలను హత్య చేసేందుకు యత్నించాడో ఓ వ్యక్తి. ఈ ఘటన ఏపీ ప్రకాశం జిల్లా దర్శిలో చోటుచేసుకుంది. జిల్లాలోని సూదనగుంట రామాపురానికి చెందిన దేశం రమణారెడ్డికి.. నారసింహనాయునిపల్లికి చెందిన కెజియాతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు రేవంత్ ఉన్నాడు. రమణారెడ్డి సినిమా హాలును లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం దర్శిలోని పొదిలి రోడ్డులో వీరు నివాసం ఉంటున్నాడు.
Murder Attempt: భార్యా బిడ్డలకు విద్యుత్ తీగలు చుట్టి.. - దర్శిలో భార్యా బిడ్డలపై హత్యాయత్నం
Murder Attempt: అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కాటికి పంపాలనుకున్నాడు ఓ కసాయి. భార్యా బిడ్డలకు విద్యుత్ తీగలు చుట్టి షాాక్ ఇచ్చి మట్టుబెట్టేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన ఏపీ ప్రకాశం జిల్లాలో జరిగింది.
భార్యపై అనుమానంతో తరచూ ఆమెను దూషిస్తూ కొట్టేవాడు. ఇటీవల గొడవలు తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి రమణారెడ్డి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. కుమారుడి గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. అంతేగాక ఇద్దరి శరీరాలకు తీగలు చుట్టి విద్యుదాఘాతం ద్వారా మట్టుబెట్టేందుకు యత్నించాడు. దీంతో రేవంత్ శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి కేకలకు నిద్ర లేచిన ఇంటి యజమాని అక్కడికి చేరుకోవడంతో రమణారెడ్డి పరారయ్యాడు. బాధితులకు దర్శి ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి ఒంగోలు తరలించారు. కెజియా ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:డిగ్రీ ఏదైనా ‘లక్ష’ణంగా పట్టా.. నకిలీ ధ్రువపత్రాల గుట్టురట్టు