సీజన్ ముగిసిన తర్వాత టమాటా ధరలు విపరీతంగా పెరుగిపోతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌యార్డులో శనివారం మొదటి రకం టమాటా కిలో ధర రూ.74, అత్యల్పంగా రూ.12 పలికింది.
TOMATO PRICE: చుక్కలు చూపిస్తోన్న టమాటా ధరలు..! - చిత్తూరు జిల్లా
ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో కిలో టమాట ధర 74 రూపాయలైంది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగానే టమాటా ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు.
tomato price
గత నెల రోజులుగా జిల్లాలోని పడమటి మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి అనూహ్యంగా తగ్గింది. అందువల్లే ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఇదీ చూడండి:TSRTC: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలు.. దేనికి ఎంతంటే!