ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ సహజ నౌకాశ్రయానికి అతి పెద్ద నౌక వచ్చింది. దాదాపు 90 వేల టన్నుల లోడ్‌తో విశాఖ నౌకాశ్రయానికి ఈ నౌక చేరుకుంది. ఎంటీ ఓస్లో అనే కార్గోనౌక నాన్ కుకింగ్ కోల్, స్టీమ్ కోల్‌తో వచ్చింది. ఇటీవలే సింగపూర్‌కి చెందిన సంస్ధ భారీ నౌకలు విశాఖకు రావడానికి ఉన్న అవకాశాలను.. సాంకేతిక వెసులుబాటుపై స్టిమ్యూలేషన్ స్టడీ చేసింది. ఈ స్టడీ తర్వాత భారీ నౌకలు వచ్చేందుకు అవకాశం ఉన్నట్టు నిర్ధరించింది. వీటి తర్వాత తొలిసారిగా విశాఖకు ఈ భారీ నౌక రావటంతో....పోర్టు వర్గాల్లో ఆనందం నెలకొంది.
విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్న భారీ కార్గో నౌక - visakha latest news
ఏపీలోని విశాఖ నౌకాశ్రయంలో భారీ కార్గో నౌక సందడి చేసింది. దాదాపు 90వేల టన్నుల లోడ్‌తో ఎంటీ ఓస్లో అనే కార్గో నౌక నాన్ కుకింగ్ కోల్, స్టీమ్ కోల్‌తో సాగర తీరానికి వచ్చింది.
విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్న భారీ కార్గో నౌక
కెప్టెన్ శర్మ నేతృత్వంలో ఇన్నర్ హార్బర్లోని ఈక్యూ 7 బెర్త్ వద్ద అన్ లోడింగ్ జరుగుతోంది. 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల వెడల్పు ఉన్న ఇంతటి భారీ నౌక ఇన్నర్ హార్బర్లోకి తొలిసారి వచ్చిందని పోర్టు వర్గాలు తెలిపాయి. ఇందులో మొత్తం 87వేల 529 మెట్రిక్ టన్నుల లోడ్ ఉందని వెల్లడించింది.
ఇదీ చదవండి:నేను భాజపాలో చేరుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: హరీశ్‌రావు