తెలంగాణ

telangana

ETV Bharat / city

రికార్డు: 73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు

73 ఏళ్ల వృద్ధులు చక్కగా మనవళ్లను ఆడిచుకుంటూ... వారి ముద్దు ముద్దు మాటలను గుర్తు చేసుకుంటూ... సంతోషంగా బతికేస్తారనేది భావన. అయితే తూర్పు గోదావరికి చెందిన మంగాయమ్మ 73 ఏళ్లకు కవలలకు జన్మనిచ్చింది.

pregnency

By

Published : Sep 5, 2019, 9:12 AM IST

Updated : Sep 5, 2019, 5:43 PM IST

తోటి వయసు వాళ్లు మనవళ్లను ఆడించుకుంటూ... కూతుళ్లను, అల్లుళ్లను... కొడుకులను, కోడళ్లను చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు. పిల్లలు లేరన్న బాధ ఒకవైపు తొలిచేస్తున్నా... మనకి పిల్లలు లేకపోతే ఏం... పక్కవారి పిల్లల్లోనే బిడ్డలను చూసుకుందాం అనే భావనతో బతికేస్తున్నారా వృద్ధ జంట. ఆ జ్ఞానం సమాజానికి లేదు పాపం... సూటిపోటి మాటలతో హింసిస్తూనే ఉంది.... ఆ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయో ఏమో... జీవితం చివరి దశలోనూ పిల్లలను కనాలనే కోరిక బలపడింది... ఆ సంకల్పమే 73 ఏళ్ల మంగాయమ్మ గర్భం దాల్చేలా చేసింది.

తూర్పుగోదావరికి చెందిన మంగాయమ్మ రాజారావు దంపతులు పిల్లలకు జన్మనివ్వాలని గుంటూరులోని అహల్యా ఆసుపత్రి వైద్యులను ఆశ్రయించారు. వారి ధైర్యాన్ని చూసి వైద్యులు వెనక్కి తగ్గలేదు... ఆ దంపతుల కలకు అహల్యా ఆసుపత్రి వైద్యులు రూపం తీసుకొచ్చారు. పెళ్లైన 57 ఏళ్ల తర్వాత మంగాయమ్మ గర్భం దాల్చేలా చేశారు. ఈరోజు గుంటూరులోని డాక్టర్​ శనక్కాయల అరుణ, ఉమా శంకర్​ ఈమెకు శస్త్ర చికిత్స చేశారు. బామ్మ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. గతంలో 70 ఏళ్లకు ప్రసవం రికార్డు ఉంది..ఇప్పుడు 73 ఏళ్ల పేరిట మంగాయమ్మ పేరిట ఆ రికార్డు నమోదైంది.

అరుదైన సంఘటన... 73 ఏళ్లకు గర్భం దాల్చిన వృద్ధురాలు

ఇదీ చూడండి: పుట్టిన రోజు కేకులో విషం... ఇద్దరు మృతి

Last Updated : Sep 5, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details