ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురణరంగమైన ఛలో రాజ్‌భవన్.. కాంగ్రెస్ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సోనియా , రాహుల్‌గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ..ఏఐసీసీ పిలుపు మేరకు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్‌కు వచ్చి మరీ కొడతా..'రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై నిరసనగా రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన ఆందోళన రణరంగంలా మారింది. రాజ్‌భవన్ ముట్టడించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.'తెలంగాణ బిగ్ గ్రీన్‌స్పాట్‌గా మారింది' తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఆశ్చర్యం కలిగిస్తోందని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ చూస్తుంటే అంతా పచ్చదనం పరిచినట్లుగా కనిపిస్తోందని తెలిపారు. 'తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వెేయండి'కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. శుక్రవారం జరగాల్సిన విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరముందని లేఖ రాశారు.'అగ్నిపథ్'పై ఉద్యోగార్థులు భగ్గు.. ఆర్మీ నియామకానికి సంబంధించిన నూతన విధానం 'అగ్నిపథ్'పై.. ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. బిహార్‌లో రెండు రైళ్లు తగులబెట్టారు.భారత్‌లో మరోసారి పోలియో కలకలం..భారత్‌లో మరోసారి పోలియో వైరస్ కలకలం సృష్టించింది. పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందిన ఎనిమిదేళ్ల తర్వాత బంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. దీంతో అధికారులను అప్రమత్తం చేసింది కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్.భారత్‌లో పబ్జీకి 'ఒలింపిక్స్' గుర్తింపు!.. నిజమెంత? భారత్‌లో విపరీతమైన ఆదరణ ఉన్న ఆన్లైన్ గేమ్ పబ్జీకి బానిసలుగా చాలా మంది మారిపోతున్నారు. ఆట మోజులో పడి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. అందువల్లే కొన్నేళ్ల క్రితం భారత్.. ఈ గేమ్‌పై నిషేధం విధించింది.దలాల్ స్ట్రీట్‌పై ఫెడ్ దెబ్బ- సెన్సెక్స్ 1000 మైనస్అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశీయంగా కరోనా కేసులు పెరగడమూ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించేందుకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 1000కిపైగా పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 15,400 దిగువకు చేరింది.అక్కడ లీటర్ పెట్రోల్ రూ.234, డీజిల్ రూ.263 ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇరవై రోజుల క్రితమే లీటర్ పెట్రోల్‌పై రూ.60 పెంచిన ప్రభుత్వం మరోసారి రూ.24 వడ్డించింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.234కు చేరింది. రాయితీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది.రానా-సాయి పల్లవి 'విరాటపర్వం'.. ఈ విషయాలు తెలుసా?రానా, సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టికెట్ ధరల వివరాలు తెలియజేసింది. ఆ వివరాలతో పాటు సినిమా గురించి మరిన్ని విశేషాలు మీకోసం..