రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 99 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,891 చేరింది. తాజా కేసుల్లో 87 మంది రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వలస కూలీలు 12 మందికి కొవిడ్ సోకింది. నలుగురు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 92కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 99 కరోనా కేసులు.. నలుగురు మృతి - తెలంగాణలో కరోనా కేసులు
21:11 June 02
రాష్ట్రంలో కొత్తగా 99 కరోనా కేసులు.. నలుగురు మృతి
తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 7, మేడ్చల్ 3, నల్గొండ జిల్లాలో ఇద్దరికి కరోనా సోకింది. మహబూబ్‌నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదయింది.
ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారు, వలస కూలీలు 446 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 1,526 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1273 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీచూడండి: ఆ ఒక్క నగరంలోనే 6.7 లక్షల దొంగ కరోనా కేసులు!