ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 8,601 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసులు 3,61,712కు చేరాయి. మరో 86 మందిని కరోనా బలి తీసుకుంది.
కరోనాతో ఇప్పటివరకు 3,368 మంది మృతి చెందారు. కరోనా నుంచి 2,68,828 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 89,516 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 54,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 32.92 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికం
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు 50 వేలు దాటాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,441 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 965, అనంతపురం జిల్లాలో 933, విశాఖ జిల్లాలో 911, కడప జిల్లాలో 639, ప్రకాశం జిల్లాలో 589, విజయనగరం జిల్లాలో 572, చిత్తూరు జిల్లాలో 495, శ్రీకాకుళం జిల్లాలో 485, కర్నూలు జిల్లాలో 484, గుంటూరు జిల్లాలో 467, ప.గో. జిల్లాలో 466, కృష్ణా జిల్లాలో 154 కరోనా కేసులు నమోదయ్యాయి.
నెల్లూరులో 10 మంది మృతి
నెల్లూరు జిల్లాలో కరోనాతో మరో 10 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో కరోనాతో 9 మంది చొప్పున చనిపోయారు. చిత్తూరు, కడప జిల్లాల్లో కరోనాతో 8 మంది చొప్పున మరణించారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనాతో ఏడుగురు చొప్పున చనిపోయారు. అనంతపురం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. విజయనగరం జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దర్ని కరోనా బలి తీసుకుంది.