గణతంత్ర దినోత్సవవేడుకలకు హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కూడా ఇక్కడే గణతంత్ర వేడుకలను నిర్వహించింది. ఈ ఏడాది వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకలకు హాజరయ్యే వారంతా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్ గార్డెన్
గణతంత్ర దినోత్సవ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో వేడుకల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనల మధ్య ఈ వేడుకలు జరపనున్నట్లు తెలిపారు.
గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్ గార్డెన్
ప్రధాన వేదికతోపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలను రూపొందిస్తున్నారు. పబ్లిక్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం రోజున పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి :'గణతంత్ర పరేడ్'కు రైతుల రూట్ మ్యాప్