తెలంగాణ

telangana

ETV Bharat / city

అంత్యక్రియల్లో పాల్గొన్న ఏడుగురికి కరోనా పాజిటివ్ - family members tested corona postive who attend funeral in rangampeta in chittor news

చిత్తూరు జిల్లాలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహానికి కొవిడ్ పరీక్షలు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అవసరం లేదు.. అనారోగ్యంతోనే చనిపోయాడని మృతుని బంధువులు వాదించి.. ఖననం చేసేశారు. చివరకు అంత్యక్రియల్లో పాల్గొన్న ఏడుగురు కరోనా బారిన పడ్డారు. గ్రామంలో మొత్తం 22 మందికి వైరస్​ పాజిటివ్​గా అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఇంకా ఎంత మందికి కరోనా అంటుకుందోనని ఆ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న ఏడుగురికి కరోనా పాజిటివ్
అంత్యక్రియల్లో పాల్గొన్న ఏడుగురికి కరోనా పాజిటివ్

By

Published : Jul 27, 2020, 10:56 PM IST

ఏపీ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో 2 రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ మృతదేహానికి కొవిడ్ పరీక్ష చేయించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడంటూ వాదించి.. సమీపంలోని శ్మశానవాటికలో ఖననం చేశారు. అతని కుటుంబీకులు కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్నారు. తీరా ఆ ఇంట్లో ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది.

మరికొందరి ఫలితాలు రావాల్సి ఉంది...

రంగంపేటకు చెందిన మరో నలుగురు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. అంత్యక్రియల్లో పాల్లొన్న మరి కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. గ్రామంలో ఇప్పటివరకు మొత్తం 22 మందికి పాజిటివ్​గా నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది.

ఇవీ చూడండి : తుది దశకు సచివాలయ భవనాల కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details