శంషాబాద్ విమానాశ్రయంలో 60 లక్షల విలువైన బంగారం సీజ్ - shamshabad airport latest news
09:13 April 07
కొచ్చి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద లభ్యం
శంషాబాద్ విమానాశ్రయంలో 1.28 కిలోల విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణా చేస్తున్న కేరళకు చెందిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి కొచ్చిన్ వచ్చిన విమానంలో ఈ బంగారాన్ని అక్రమంగా తెచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అక్కడ దిగిన ప్రయాణికుడు ఈ బంగారాన్ని మరుగు దొడ్డిలో దాచాడు. మరో ప్రయాణికుడు ఆ బంగారాన్ని తీసుకుని కొచ్చిన్లో అదే విమానాన్ని ఎక్కాడు.
పక్కా సమాచారం ఉన్న అధికారులు... విమానం శంషాబాద్ విమానాశ్రయానికి రాగానే ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద 1.28 కిలోల బరువు కలిగిన మొత్తం 11 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 60 లక్షలు ఉంటుందని విమానాశ్రయం కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ శివ కృష్ణ తెలిపారు. ఆ బంగారం ఎక్కడికి తీసుకొచ్చారు...? ఎవరికి ఇచ్చేందుకు హైదరాబాద్ తెచ్చారు...? అన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.