రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
21:07 May 14
రాష్ట్రంలో ఇవాళ 47 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంలేదు. కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1414కు చేసింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 34గా ఉంది. ఈసారి కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు వచ్చాయి. 47 కేసుల్లో 40 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మరో ఐదుగురు రంగారెడ్డి జిల్లా వాసులకు సోకగా... ఇద్దరు వలస కార్మికులకు వైరస్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
13 మంది డిశ్చార్జి అవగా... మొత్తం కోలుకున్నవారి సంఖ్య 952కు చేరింది. మరో 428మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఇద్దరు వలసజీవులకు కరోనా సోకడంతో మొత్తం సంఖ్య 37కు చేరింది. మరోవైపు పురుషులతో పోల్చితే మహిళల్లో కరోనా మరణాలు తక్కువగా ఉన్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మృతుల్లో 27 మంది పురుషులు ఉండగా.. ఏడుగురు మహిళలు ఈ మహమ్మారికి బలయ్యారు. ఆంక్షలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని విమానాశ్రయం, రైల్వే స్టేషన్లలోనే పరీక్షలు నిర్వహిస్తునట్టు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.