ఏపీలో మద్యం దుకాణాల సంఖ్యను ప్రభుత్వం కుదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కుదింపుతో మొత్తం 33 శాతం మేర దుకాణాలను ఇప్పటి వరకూ తగ్గించినట్టైందని ప్రభుత్వం స్పష్టంచేసింది. మద్యపానాన్ని నిరుత్సాహపరచటమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. అదనపు ఎక్సైజ్ రిటైల్ టాక్స్ పేరిట మద్యం ధరలు పెంచి కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు కార్యాచరణ చేపట్టినట్టు వెల్లడించింది.
సుమారు 43వేల బెల్టు షాపుల తొలగింపు !
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 43 వేల బెల్టు షాపులు తొలగించామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇందులో భాగంగా ప్రతి వ్యక్తికి బీర్లు, మద్యం సీసాలను మూడు మాత్రమే విక్రయించేందుకు పరిమితం చేశామని పేర్కొంది. మరోవైపు మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములు కూడా తొలగించినట్లు తెలియచేసింది.