రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు
20:05 May 09
రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు
గత నాలుగైదు రోజులతో పోల్చితే ఇవాళ అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు 31 మందికి కొవిడ్-19 వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 30 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1163కి చేరింది. ఇవాళ కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 30కు చేరింది. వైరస్ బారినుంచి కోలుకొని ఇవాళ 24 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 751 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 382 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీచూడండి:కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్