తెలంగాణ

telangana

ETV Bharat / city

Corona cases in telangana: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. తాజాగా 2983 కేసులు.. - తెలంగాణ కరోనా కేసులు

2983 new corona cases in telangana today
2983 new corona cases in telangana today

By

Published : Jan 18, 2022, 7:34 PM IST

Updated : Jan 18, 2022, 8:07 PM IST

19:28 January 18

corona cases in telangana: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. తాజాగా 2983 కేసులు..

Telangana corona cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,07,904 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,983 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,14,639‬కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

corona active cases: తాజాగా రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,062కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 22,706 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 1,206 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 96.29 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఇవాళ 2,93,843 మందికి కొవిడ్‌ టీకా డోసులు ఇచ్చారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 5.09 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టయింది.

Telangana DH corona: ఒమిక్రాన్‌ దెబ్బకు వైద్యసిబ్బంది విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్‌ బారినపడుతున్నారు. ఇప్పటికే గాంధీ, ఎర్రగడ్డ మానసిన వైద్యశాలల్లో కలిపి 120 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాస రావుకు కరోనా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరుతున్నట్లు తెలిపారు.

BRK Bhavan Covid Cases: సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్​లో కొవిడ్ కలకలం కొనసాగుతోంది. పలువురు సీనియర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఐఏఎస్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీనివాసరాజుకు పాజిటివ్ నిర్ధరణ అయింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పలువురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాదాపు పాతిక మంది వరకు కొవిడ్ బారిన పడ్డట్లు సమాచారం.

Telangana Police corona: పోలీస్​ శాఖను కూడా వైరస్ వదలట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 72 మంది పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్​ పోలీస్​ స్టేషన్​లో సీఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్​గా తేలింది. అటు నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. హైదరాబాద్ సీసీఎస్‌, సైబర్ క్రైమ్‌లో పనిచేస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. చైతన్యపురి పీఎస్​లో 8 మంది కానిస్టేబుళ్లు, వనస్థలిపురంలో ఒకరు, అబ్దుల్లాపూర్​మెట్​లో ఒకరికి కరోనా సోకింది. అల్వాల్​ పోలీస్​స్టేషన్​లో నలుగురు సిబ్బంది కొవిడ్​ బారిన పడ్డారు.

ఇదీ చూడండి:

Last Updated : Jan 18, 2022, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details