రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రాష్ట్రంలో మొత్తం 46,578 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 218 కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కరోనా మహమ్మారి బారినపడి మరో 248 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,390 కరోనా యాక్టివ్ కేసులున్నట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.