Telangana corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,073 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,07,162కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Telangana corona cases: రాష్ట్రంలో తాజాగా 1963 మందికి కరోనా.. ఇద్దరు మృతి - కరోనా కేసులు
19:50 January 15
Telangana corona cases: రాష్ట్రంలో తాజాగా 1963 మందికి కరోనా.. ఇద్దరు మృతి
corona active cases: తాజాగా రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,054కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 1,620 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,017 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,075 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 96.31 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది.
కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో తాజాగా 43,463 మందికి కొవిడ్ టీకాల పంపిణీ జరిగింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,68,833 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: