రాష్ట్రంలో కొత్తగా 1,504 కరోనా కేసులు - తెలంగాణ కొవిడ్ బాధితుల సంఖ్య
08:31 October 29
రాష్ట్రంలో కొత్తగా 1,504 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,504 కరోనా కేసులు వెలుగుచూశాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 288 మందికి కొవిడ్ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2,35,656 చేరింది. వైరస్ బారినపడి మరో 5 మంది మరణించగా.. మొత్తం 1,324 మంది మృత్యువాతపడ్డారు.
కరోనా నుంచి 1,436 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,16,353కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,979 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 14,938 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.
ఇవీచూడండి:కరోనా బాధితుల్లో విటమిన్-డి లోపం!