ఏపీవ్యాప్తంగా 84,502 శాంపిల్స్ పరీక్షించగా.. 14,429 మందికి కరోనా పాజిటివ్ (corona positive)గా నిర్ధరణ అయింది. వైరస్ బారినపడి 103 మృతిచెందారు. కొత్తగా 20,746 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధికంగా 15 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో 10, నెల్లూరులో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరి 8, కృష్ణా 8, గుంటూరు 7, విజయనగరం 7, శ్రీకాకుళం 6, కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మరణించినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.