తెలంగాణ

telangana

ETV Bharat / city

'హై పవర్ కమిటీలో రైతులకు చోటు ఇవ్వరా?'

ఏపీలో రైతులు వెనక్కు తగ్గడం లేదు. అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ ఆందోళన ఆపేది లేదంటూ.. మందడంలో 13 వ రోజూ నిరసనలు కొనసాగిస్తున్నారు.

13th-day-protests-in-amaravathi-for-capital
'హై పవర్ కమిటీలో రైతులకు చోటు ఇవ్వరా?'

By

Published : Dec 30, 2019, 11:13 AM IST

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మందడంలో.. రాజధాని పరిరక్షణే ధ్యేయంగా 13వ రోజూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీలో మళ్లీ మంత్రులకే చోటు కల్పించారంటూ రైతులు ఆగ్రహించారు. రైతులకు ఎందుకు చోటు ఇవ్వలేదని నిలదీశారు. తమను పెయిడ్ ఆర్టిస్టులని అంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు తమ వద్దకు వచ్చి మాట్లాడాలన్నారు. నెలయినా.. రెండు నెలలయినా సరే.. అమరావతే రాజధాని.. అని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ ఆందోళన ఆపేది లేదని తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలను.. మందడం నుంచి మా ప్రతినిధి అందిస్తారు.

'హై పవర్ కమిటీలో రైతులకు చోటు ఇవ్వరా?'

ABOUT THE AUTHOR

...view details