రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజునే రికార్డుస్థాయిలో అత్యధికంగా 1,087 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తొలిసారిగా ఒక్కరోజులో పాజిటివ్ కేసులు వెయ్యి దాటాయి. గడిచిన ఎనిమిది రోజుల వ్యవధిలో కొవిడ్ కేసులు రెట్టింపయ్యాయి. ఈనెల 19న 6,526 కేసులు ఉంటే... శనివారం నాటికి 13,436కు చేరాయి. శనివారం ఒక్కరోజులో 3,923 శాంపిల్స్‌ను పరీక్షించగా ఇందులో 27.7 శాతం పాజిటివ్ కేసులు రావడం గమనార్హం. కరోనాతో చికిత్స పొందుతూ మరో ఆరుగురు చనిపోయారు. దీంతో మరణాలు 243కి చేరాయి. గడిచిన 21 రోజుల్లో మరణాలు రెండింతలయ్యాయి. చికిత్స నుంచి కోలుకుని 162 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 8,265 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు - తెలంగాణ కరోనా మరణాలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎనిమిది రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయి. శనివారం ఒక్కరోనే రికార్డు స్థాయిలో 1,087 కేసులు నమోదయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 888 కేసులు వచ్చాయి. ఈ మహమ్మారికి మరో ఆరుగురు బలయ్యారు. మొత్తం కేసులు 13,436కు చేరాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజులో 888 కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 74 నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో ఒక్కరోజులోనే 35 మందికి వైరస్ సోకింది. మేడ్చల్‌లో 37 కేసులు, సంగారెడ్డిలో 11 కేసులు వచ్చాయి. పరీక్షల సంఖ్య పెరుగుతుండటంతో ఆ మేరకు కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కరోజులో అత్యధికంగా 3,923 పరీక్షలు జరిగాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఇంటివద్దే ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరింది.
ఇదీ చదవండి:నేటి నుంచి పీవీ శతజయంత్యుత్సవాలు.. ప్రారంభించనున్న కేసీఆర్