ఎన్నికల హామీలే లక్ష్యంగా - STATE BUDGET
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ప్రస్తుత పథకాల కొనసాగింపుతో పాటు ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసే లక్ష్యంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండనుంది. ఆసరా ఫించన్లు, రైతుబంధు సాయం పెంపు, రైతురుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఈ సారి అధికంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది.
బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు
సమావేశానికి నాలుగు రోజులు సరిపోతాయనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మెుదటిరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టి, దానిపై రెండు రోజుల పాటు చర్చ జరపనుంది. చివరిరోజు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపనుంది. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ముగించి, మార్చిలో లోక్సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.