తెలంగాణ

telangana

ETV Bharat / city

తాటి, ఈత వనాలకు ప్రాధాన్యం - abkari

కల్లుగీత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హరితహారంలో తాటి, ఈత మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆబ్కారి, పర్యాటక, క్రీడా శాఖలతో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఆబ్కారి, పర్యాటక, క్రీడా శాఖలతో ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ సమీక్ష

By

Published : Mar 6, 2019, 11:58 PM IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
రాష్ట్రంలో ఇప్పటికే గుడుంబాను పూర్తిగా నిర్మూలించామని.... ఇంకా ఎక్కడైనా సారా తయారీ కేంద్రాలుంటే అరికట్టారని ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కల్లుగీత కార్మికులను ప్రోత్సహించటానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. బేగంపేటలోని పర్యాటక భవన్​లో ఆబ్కారి, పర్యాటక, క్రీడా శాఖలతో ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆబ్కారి శాఖ పనితీరు గురించి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ... మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు వివరించారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం రాకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

నిర్మాణంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయాలను వెంటనే పూర్తి చేయాలని మంత్రి అన్నారు. హరితహారంలో తాటి, ఈత వనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. పర్యాటక, క్రీడా శాఖలపైనా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details