తెలంగాణ

telangana

ETV Bharat / city

'జీహెచ్​ఎంసీ పరిధిలో దోమలపై డ్రోన్లతో సమరం'

జీహెచ్​ఎంసీ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని చెరువుల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టారు. సాదాసీదాగా కాకుండా.. ఈసారి ఏకంగా డ్రోన్లను రంగంలోకి దింపారు.

By

Published : Mar 28, 2019, 9:22 PM IST

Updated : Mar 29, 2019, 7:42 AM IST

పిచికారి చేస్తున్న డ్రోన్​

'జీహెచ్​ఎంసీ పరిధిలో దోమలపై డ్రోన్లతో సమరం'
గ్రేటర్ పరధిలో దోమల బెడద పెరిగిపోతోంది. చెరువుల్లో గుర్రపుడెక్క పుణ్యమా అనిదోమలు విజృంభిస్తున్నాయి. వేసవికాలమైనా.. డెంగ్యూ, మలేరియాతో చెరువుల సమీపంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణపై దృష్టి సారించిన గ్రేటర్ అధికారులు... సంప్రదాయబద్ధంగా వాడుతున్న పద్ధతుల స్థానంలో కొత్త టెక్నాలజీ ఉపయోగించారు. డ్రోన్లతో చెరువుల్లో రసాయనాలు చల్లడం ప్రారంభించారు.

గురునాథం చెరువుతో ప్రారంభం

హైదరాబాద్​ మియాపూర్​లోని గురునాథం చెరువులో మొట్టమొదటి సారిగా డ్రోన్ ద్వారా రసాయనాలను వెదజల్లే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జోనల్ కమిషనర్ హరిచందన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ ప్రయోగం విజయవంతమైతే అన్ని చెరువుల్లో డ్రోన్ల ద్వారా రసాయనాలు పిచికారి చేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:ఇది ఆసుపత్రా.. లేక పశువుల సంతా..?

Last Updated : Mar 29, 2019, 7:42 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details