తెలంగాణ

telangana

ETV Bharat / city

తొలగించినవి మళ్లీ పరిశీలిస్తాం: దానకిశోర్​ - GHMC COMMISSIONER

రాజకీయ పార్టీల నేతలతో జీహెచ్​ఎంసీ కమిషనర్​, హైదరాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్​ సమావేశమయ్యారు.

ఓటర్ల జాబితా పరిశీలన వేగవంతం

By

Published : Feb 11, 2019, 3:51 AM IST

ఓటర్ల జాబితా పరిశీలన వేగవంతం
లోక్​సభ ఎన్నికల దృష్ట్యా నగరంలో ఓటర్ల జాబితా పరిశీలన వేగవంతం చేసినట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్, హైదరాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి​ దానకిశోర్​ తెలిపారు. ఫిబ్రవరి 22న తుది జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు సోమవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 1.47 లక్షల మంది కొత్త ఓట్లు వచ్చాయని, 28,500లకు పైగా ఓట్లను తొలగించినట్లు వెల్లడించారు. రేపటి నుంచి ఈవీఎంల ప్రాథమిక పరిశీలన ఉంటుందని వివరించారు. ఎన్నికల కేసు నడుస్తున్న 5 నియోజకవర్గాల్లో మినహాయించి మిగతా 14 నియోజకవర్గాల్లో ఈవీఎంలను పరిశీలిస్తామన్నారు. ఇందుకోసం ముగ్గురు నోడల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. గతంలో తొలగించిన పేర్లను పరిశీలించి జాబితా రూపొందిస్తామని దానకిశోర్​ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details