తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రవేశ పరీక్షల ఫీవర్ మొదలైంది - STUDENTS

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల సీజన్ మొదలైంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఒక్కొక్కటిగా నోటిఫికేషన్ విడుదలవుతున్నాయి. ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్స్, తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు.

జేఈఈ మెయిన్స్, తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

By

Published : Feb 9, 2019, 7:26 AM IST

Updated : Feb 9, 2019, 8:50 AM IST

జేఈఈ మెయిన్స్, తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
జేఈఈ మెయిన్స్, తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంరెండో విడత జేఈఈ మెయిన్స్​ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి 20 మధ్య నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ.. ఎన్​టీఏ ప్రకటించింది. ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్, బీఆర్క్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు... నేడు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మార్చి 8 వరకు అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్స్​లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 2 లక్షల 25 వేల మందికి.. ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష రాసే అర్హత ఉంటుంది. ఇటు రాష్ట్రంలో ఈ నెల 21న ఐసెట్ నోటిఫికేషన్​ను విడుదల చేస్తున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఆన్​లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 6 వరకు ఉంది. మే 9 నుంచి హాల్​ టిక్కెట్లు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. మే 23, 24 తేదీల్లో పరీక్ష ఉంటుంది. మే 29 న ప్రిలిమినరి కీ, జూన్ 13న పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. పరీక్ష కోసం తెలంగాణలో 12, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
Last Updated : Feb 9, 2019, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details