గులాబీ బాటలో హస్తం..! - elections
అసెంబ్లీ ఎన్నికల దెబ్బతో కాంగ్రెస్ మేల్కొంది. ఈసారి ముందుగానే అప్రమత్తమవుతోంది. ఆలస్యం కాకుండా.. వ్యూహం సిద్ధం చేసుకుంది. ముందుగా ఈ నెలాఖరు నాటికి అభ్యర్థుల ప్రకటన, తరువాత ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక రూపొందించుకుంది.
నెలాఖరు నాటికి అభ్యర్థుల ప్రకటన
అభ్యర్థుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. బలాబలాలు, నియోజకవర్గ పరిస్థితులు, ఆర్థిక, సామాజిక అంశాల ఆధారంగా జాబితా తయారు చేసి పంపాలని అధిష్ఠానం ఆదేశించింది. నెలాఖరు వరకు అర్జీలు పరిశీలించి జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం... ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది హస్తం పార్టీ.