తెలంగాణ

telangana

ETV Bharat / city

'మినీ పార్కులకు కేరాఫ్​ అడ్రస్​గా చించోలి గ్రామం'

ఏదైనా సాధించాలనే తపన, కృషి ఉంటే ఏదైనా సాధించగలం. నలుగురి మన్ననలు పొందగలమి నిరూపించాడు ఆ గ్రామ పంచాయతి జూనియర్ కార్యదర్శి హర్షవర్ధన్. పల్లెల్లో ప్రకృతి వనాలు, పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. గ్రామస్థులు సహకారంతో ఆ పల్లెకే అందాన్ని తెచ్చిపెట్టారు. వ్యర్థాలుగా వదిలేసిన వస్తువులను ఆకర్షణీయంగా చేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఆ గ్రామంలో చేపట్టిన పనులను చూసి జిల్లాలోని మరో 30 గ్రామాల వరకు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి.

'మినీ పార్కులకు కేరాఫ్​ అడ్రస్​గా చించోలి గ్రామం'
'మినీ పార్కులకు కేరాఫ్​ అడ్రస్​గా చించోలి గ్రామం'

By

Published : Oct 3, 2020, 3:18 PM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మలక్ చించొలి గ్రామంలో సుమారు 2వేల మంది జనాభా ఉంటారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేయగా.. చించొలి గ్రామ జూనియర్​ కార్యదర్శి హర్షవర్ధన్ గ్రామంలో మినీ పార్కును ఏర్పాటు చేశారు. వృథాగా ఉన్న బండి చక్రాలకు రంగులు అద్ది ఆకట్టుకునే పూలచెట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. అయితే స్థలం సరిపోనందున గ్రామస్థులు, స్థానిక నాయకుల సూచనలతో గ్రామ శివారులో గ్రీన్​జోన్ పేరుతో మరో పార్కును ఏర్పాటు చేశారు. పార్కులో మొక్కలు నాటి, చెడిపోయిన వాహనాల చక్రాలు, ఎడ్ల బండి చక్రాలకు రంగులు వేసి పార్కుల్లో అలంకరించారు, ఖాళీ మద్యం సీసాలతో చెట్టు ఆకారాన్ని అమర్చి ఆకట్టుకున్నారు.

చించోలి గ్రామంలోని ప్రకృతి వనం
వృథా వస్తువులతో నిర్మితమైన పార్కు

అరెకరంలో 2 వేల మొక్కలను పెంచి..

ఎండిన చెట్టుకు పక్షుల గూళ్లను అమర్చారు. ఏనుగు బొమ్మ, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. గ్రామశివారులో ఉండటం, రహదారి ప్రక్కనే ఉండటంతో గ్రామస్థులతో పాటు, రహదారి వెంట వచ్చిపోయేవారు సేద తీరుతున్నారు. పార్క్​కు పై భాగంలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశారు. అరెకరంలో 2 వేల మొక్కలను పెంచి.. పాత మట్టి కుండలతో అలంకరించి ఎండిన వరిగడ్డితో పక్షుల గూళ్లు కట్టారు. గ్రీన్​జోన్​కు పల్లె ప్రకృతి వనానికి మధ్య కాలువ ఉండటంతో బ్రిడ్జి నిర్మించాలని ఆలోచించారు. ఇంజినీర్​ దగ్గరకు వెళ్లి ప్రతిపాదనలు వేయించారు.

ఎడ్ల బండి చక్రాలకు రంగులేసి ఆకట్టుకునేలా..
నిరుపయోగ వస్తువులతో తయారు చేసిన ఏనుగు
రమణీయంగా రూపుదిద్దుకుంటున్న మరో పార్కు

మరో 30 గ్రామాలకు ఆదర్శంగా..

దాదాపు రూ.లక్ష వ్యయం అవుతున్నందున కార్యదర్శి ఆలోచనతో గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా తొలగించిన విద్యుత్ స్తంభాలతో బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారు.ఈ బ్రిడ్జ్​ నిర్మాణానికి రూ.35 వేలు ఖర్చు అవుతుందట. చించోలిలో చేపట్టిన పనులను చూసి జిల్లాలోని మరో 30 గ్రామాల వరకు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి.

వ్యర్ధాలతో తయారు చేిసన చెట్టు
అరెకరంలో నాటిన రెండు వేలకు పైగా మొక్కలు

ఇవీ చూడండి:పుంజుకుంటున్న ఆధార్​ సేవలు.. పునఃప్రారంభమైన కార్డుల జారీప్రక్రియ

ABOUT THE AUTHOR

...view details